1 మన రక్షకుడైన దేవునియొక్కయు మన నిరీక్షణయైన క్రీస్తుయేసుయొక్కయు ఆజ్ఞప్రకారము క్రీస్తుయేసుయొక్క అపొస్తులుడైన పౌలు,
2 విశ్వాసమునుబట్టి నా నిజమైన కుమారుడగు తిమొథెయుకు (శుభమని చెప్పి) వ్రాయునది. తండ్రియైన దేవునినుండియు మన ప్రభువైన క్రీస్తుయేసునుండియు కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగును గాక.
3-4. నేను మకెదొనియకు వెళ్లుచుండగా (సత్యమునకు) భిన్నమైన బోధ చేయవద్దనియు, కల్పనాకథలును మితములేని వంశావళులును, విశ్వాససంబంధమైన దేవుని యేర్పాటుతోకాక వివాదములతోనే సంబంధము కలిగియున్నవి గనుక వాటిని లక్ష్యపెట్టవద్దనియు, కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచియుండవలెనని నిన్ను హెచ్చరించినప్రకారము (ఇప్పుడును హెచ్చరించుచున్నాను. )
5 ఉపదేశసారమేదనగా, పవిత్ర హృదయమునుండియు, మంచి మనస్సాక్షినుండియు, నిష్కపటమైన విశ్వాసమునుండియు కలుగు ప్రేమయే.
6-7. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి, తాము చెప్పువాటినైను, నిశ్చయమైనట్టు రూఢిగా పలుకువాటినైనను గ్రహింపక పోయినను ధర్మశాస్త్రోపదేశకులై యుండగోరి నిష్ ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరి.
8-11. అయినను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్తప్రకారము, ధర్మశాస్త్రము ధర్మవిరోధులకును అవిధేయులకును భక్తిహీనులకునుపాపిష్టులకును అపవిత్రులకులకును మతదూషకులకునుపిత్రుహంతకులకును మాత్రుహంతకులకును నరహంతకులకును వ్యభిచారులకును పురుషసంయోగులకును మనుష్యచోరులకును అబద్దికులకును అప్రమాణికులకును హితబోధకువిరోధియైనవాడు మరి ఎవడైన ఉండినయెడల అట్టివానికిని నియమింపబడెను గాని నీతిమంతునికి నియమింపబడలేదని యెవడైనను ఎరిగి, ధర్మానుకూలముగా దానిని ఉపయోగించినయెడల ధర్మశాస్త్రము మేలైనదని మనమెరుగుదుము.
12-13. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరచిన మన ప్రభువైన క్రీస్తుయేసుకు కృతజ్ఞుడనై యున్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసితిని గనుక కనికరింపబడితిని.
14 మరియు మన ప్రభువుయొక్క కృపయు, క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు, అత్యధికముగా విస్తరించెను.
15 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునైయున్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను.
16 అయినను నిత్యజీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనుపరచునట్లు నేను కనికరింపబడితిని.
17 (సకల) యుగములలో రాజైయుండి, అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగును గాక. ఆమెన్.
18 నా కుమారుడవైనతిమొథెయూ, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగినవాడవై, నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ సద్యుద్ధము జరిగింపవలెనని వాటినిబట్టి యీ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను.
19 అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి, విశ్వాసవిషయమై ఓడ బద్దలైపోయినవారివలె చెడియున్నారు.
20 వారిలో హుమెనైయును అలెక్సంద్రును ఉన్నారు; వీరు దూషింపకుండ శిక్షింపబడుటకై వీరిని సాతానుకు అప్పగించితిని.

No comments:
Post a Comment