Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Wednesday, July 24, 2013

1వతిమోతికి5వఅధ్యాయము

1  వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతని హెచ్చరించుము. 
2  అన్నదమ్ములని యౌవనస్థులను, తల్లులని వృద్ధస్త్రీలను అక్కచెల్లెండ్లని పూర్ణపవిత్రతతో యౌవనస్త్రీలను హెచ్చరించుము. 
3  నిజముగా అనాథలైన విధవరాండ్లను సన్మానింపుము. 
4  అయితే ఏ విధవరాలికైనను పిల్లలు గాని మనమలు గాని యుండినయెడల, వీరు మొదట తమ యింటివారియెడల భక్తి కనుపరచుటకును, తమ తలిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకొనవలెను; ఇది దేవుని దృష్టికనుకూలమైయున్నది. 
5  అయితే నిజముగా అనాథయైన విధవరాలు ఏకాకియైయుండి, దేవునిమీదనే తన నిరీక్షణనుంచుకొని, విజ్ఞాపనలయందును ప్రార్థనలయందును రేయింబగలు నిలుకడగా ఉండును. 
6  సుఖభోగములయందు ప్రవర్తించునది బ్రదుకుచుండియు చచ్చినదైయుండును. 
7  వారు నిందారహితులై యుండునట్లు ఈలాగు ఆజ్ఞాపించుము. 
8  ఎవడైనను స్వకీయులను, విశేషముగా తన యింటివారిని, సంరక్షింపకపోయినయెడల వాడు విశ్వాసత్యాగము చేసినవాడై అవిశ్వాసికన్న చెడ్డవాడై యుండును. 
9  అరువది ఏండ్లకంటె తక్కువ వయస్సులేకుండి, ఒక్క పురుషునికే భార్యయై, 
10  సత్ క్రియలకు పేరుపొందిన విధవరాలు పిల్లలు పెంచి, పరదేశులకు ఆతిథ్యముచేసి, పరిశుద్ధుల పాదములు కడిగి, శ్రమపడువారికి సహాయముచేసి, ప్రతి సత్కార్యము చేయబూనుకొనినదైతే ఆమెను విధవరాండ్ల లెక్కలో చేర్చవచ్చును. 
11  యౌవనస్థులైన విధవరాండ్లను లెక్కలో చేర్చవద్దు; 
12  వారు క్రీస్తుకు విరోధముగా నిరంకుశలైనప్పుడు తమ మొదట విశ్వాసమును వదలుకొనిరను తీర్పుపొందినవారై పెండ్లాడగోరుదురు. 
13  మరియు వారు ఇంటింట తిరుగులాడుచు, బద్ధకురాండ్లగుటకు మాత్రమేగాక, ఆడరాని మాటలాడుచు, వదురుబోతులును పరుల జోలికి పోవువారునగుటకును నేర్చుకొందురు. 
14  కాబట్టి యౌవనస్త్రీలు వివాహము చేసికొని, పిల్లలు కని గృహపరిపాలన జరిగించుచు, నిందించుటకు విరోధికి అవకాశమియ్యకుండవలెనని కోరుచున్నాను. 
15  ఇంతకుముందే కొందరు త్రోవనుండి తొలగిపోయి సాతానును వెంబడించినవారైరి. 
16  విశ్వాసురాలైన యే స్త్రీ యింటనైనను విధవరాండ్లుండినయెడల, సంఘము నిజముగా అనాథలైన విధవరాండ్లకు సహాయముచేయుటకై దానిమీద భారములేకుండ ఆమెయే వీరికి సహాయము చేయవలెను. 
17  బాగుగా పాలనచేయు పెద్దలను, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడువారిని, రెట్టింపు సన్మానమునకు పాత్రులనుగా ఎంచవలెను. 
18  ఇందుకు-నూర్చెడి యెద్దుమూతికి చిక్కము వేయవద్దు అనియుపనివాడు తన జీతమునకు పాత్రుడు అనియు లేఖనము చెప్పుచున్నది. 1
19  ఇద్దరు ముగ్గురు సాక్షులుంటేనే గాని పెద్దమీద దోషారోపణ అంగీకరింపకుము. 
20  ఇతరులు భయపడునిమిత్తము పాపము చేయువారిని అందరియెదుట గద్దింపుము. 
21  విరోధ బుద్ధితో నైనను పక్షపాతముతోనైనను ఏమియుచేయక (నేను చెప్పిన) ఈ సంగతులను గైకొనవలెనని దేవుని యెదుటను, క్రీస్తుయేసు ఎదుటను, ఏర్పరచబడిన దేవదూతలయెదుటను నీకు ఆనబెట్టుచున్నాను. 2
22  త్వరపడి యెవనిమీదనైనను హస్తనిక్షేపణము చేయకుము. పరుల పాపములలో పాలివాడవై యుండకుము. నీవు పవిత్రుడవుగా ఉండునట్లు చూచుకొనుము. 
23  ఇకమీదట నీళ్లే త్రాగక నీ కడుపు జబ్బుకును తరచుగా వచ్చు బలహీనతలకోసరమును ద్రాక్షరసమును కొంచెముగా పుచ్చుకొనుము. 
24  కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపుతీర్పునకు ముందుగా నడుచుచున్నవి, మరికొందరి పాపములు వారి వెంట వెళ్లుచున్నవి. 
25  అటువలె మంచి కార్యములు తేటగా బయలుపడుచున్నవి, బయలుపడనివి దాచబడనేరవు. 
    Download Audio File

No comments:

Post a Comment