1-2. మనము సంపూర్ణభక్తియు మాన్యతయు కలిగి, నెమ్మదిగాను సుఖముగాను బ్రదుకు నిమిత్తము, అన్నిటికంటె ముఖ్యముగా మనుష్యులందరికొరకును రాజుల కొరకును అధికారులందరికొరకును విజ్ఞాపనములును ప్రార్థనలును యాచనలును కృతజ్ఞతాస్తుతులును చేయవలెనని హెచ్చరించుచున్నాను.
3 ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై యున్నది.
4 ఆయన, మనుష్యులందరు రక్షణపొంది సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానముగలవారై యుండ వలెనని యిచ్ఛయించుచున్నాడు.
5 దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే; ఆయన క్రీస్తుయేసను నరుడు.
6 ఈయన అందరికొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దీనిగూర్చిన సాక్ష్యము యుక్తకాలములయందు ఇయ్యబడును.
7 (ఈ సాక్ష్యమిచ్చుటకై) నేను ప్రకటించువాడుగాను, అపొస్తులుడనుగాను, విశ్వాససత్యముల విషయములో అన్యజనులకు బోధకుడుగాను నియమింపబడితిని. నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధమాడుటలేదు.
8 కావున ప్రతిస్థలమందు పురుషులు కోపమును సంశయమును లేనివారై, పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను.
9 మరియు స్త్రీలును అణుకువయు స్వస్థబుద్ధియు గలవారై యుండి, తగుమాత్రపు వస్త్రములచేతనేగాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక,
10 దైవభక్తిగలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్ క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను.
11 స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణవిధేయతతో నేర్చుకొనవలెను.
12 స్త్రీ మౌనముగా ఉండవలసినదేగాని ఉపదేశించుటకైనను, పురుషునిమీద అధికారముచేయుటకైనను ఆమెకు సెలవియ్యను.
13 మొదట ఆదామును తరువాత హవ్వయును నిర్మింపబడిరి కారా?
14 మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను.
15 అయినను వారు స్వస్థబుద్ధి కలిగి, విశ్వాస ప్రేమ పరిశుద్ధతలయందు నిలుకడగా ఉండినయెడల శిశుప్రసూతిద్వారా ఆమె రక్షింపబడును.

No comments:
Post a Comment