Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Wednesday, July 24, 2013

1వతిమోతికి6వఅధ్యాయము

1  దేవుని నామమును ఆయన బోధయు దూషింపబడకుండునట్లు దాసత్వమను కాడిక్రింద ఉన్నవారందరును తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులని యెంచవలెను. 
2  విశ్వాసులైన యజమానులుగల దాసులు తమ యజమానులు సహోదరులని వారిని తృణీకరింపక, తమ సేవఫలము పొందువారు విశ్వాసులును ప్రియులులాయున్నారని మరి యెక్కువగా వారికి సేవచేయవలెను; ఈ సంగతులు బోధించుచు వారిని హెచ్చరించుము. 
3  ఎవడైనను మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క హిత వాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక, భిన్నమైన బోధనుపదేశించినయెడల 
4  వాడేమియు ఎరుగక తర్కములనుగూర్చియు వాగ్వాదములనుగూర్చియు వ్యర్ధముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటిమూలముగా అసూయ కలహము దూషణలు దురనుమానములును, 
5  చెడిపోయిన మనస్సుకలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధనమనుకొను మనుష్యుల వ్యర్ధ వివాదములును కలుగుచున్నవి. 
6  సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమై యున్నది. 
   7-8. మనమీ లోకములోనికి ఏమియు తేలేదు, దీనిలోనుండి ఏమియు తీసికొనిపోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమైయుండి వాటితో తృప్తిపొందియుందము. 
9  ధనవంతులగుటకు ఆపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములను హానికరములునైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును. 
10  ఎందుకనగా ధనాపేక్షసమస్తమైన కీడులకు మూలము; కొందరు దానిని ఆశించి విశ్వాసమునుండి తొలగిపోయి నానాబాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. 
11  దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి, నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. 
12  విశ్వాససంబంధమైన మంచి పోరాటము పోరాడుము, నిత్యజీవమును చేపట్టుము. దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులయెదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. 
13  సమస్తమునకు జీవాధారకుడైన దేవునియెదుటను, పొంతిపిలాతునొద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యమిచ్చిన క్రీస్తుయేసు ఎదుటను, 
14  మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు పర్యంతము, నీవు నిష్కలంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలెనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. 
15  శ్రీమంతుడును అద్వితీయుడును సర్వాధిపతి యుక్తకాలములయందు ( ఆ ప్రత్యక్షతను) కనుపరచును. (ఆ సర్వాధిపతి) రాజులకు రాజును ప్రభవులకు ప్రభువునై యున్నాడు. 
16  ఆయనమాత్రమే దురవగాహమైన తేజస్సులో వసించుచు అమరత్వముగలవాడై యున్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు; ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండును గాక. ఆమేన్. 
17  ఇహమందు ధనవంతులైనవారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మికయుంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగ దయచేయు దేవునియందే నమ్మికయుంచుడని ఆజ్ఞాపించుము. 
  18-19. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొనునిమిత్తము, రాబోవు కాలమునకు మంచి పునాది తమకొరకు వేసికొనుచు, మేలుచేయువారును, సత్ క్రియలు అను ధనముగలవారును, ఔదార్యముగలవారును, (తమ ధనములో) ఇతరులకు పాలి వారునై యుండవలెనని వారికి ఆజ్ఞాపించుము. 
20  ఓ తిమోథెయూ నీకు అప్పగింపబడినదానిని కాపాడి, అపవిత్రమైన వట్టి మాటలకును, జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీతవాదములకును దూరముగా ఉండుము. 
21  ఆ విషయములో ప్రవీణులమని కొందరనుకొని విశ్వాసవిషయములో తప్పిపోయిరి. కృప మీకందరికీ తోడై యుండును గాక.
   Download Audio File

No comments:

Post a Comment