1 అయితే కడవరి దినములలో కొందరు అబద్దికుల
2 వేషధారణవలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి, విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు.
3 ఆ అబద్ధికులు, వాతవేయబడిన మనస్సాక్షిగలవారై, వివాహమును నిషేధించుచు, సత్యవిషయమై అనుభవజ్ఞానముగల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొను నిమిత్తము దేవుడు సృజించిన ఆహారవస్తువులను కొన్ని (తినక) మానవలెనని చెప్పుచుందురు.
4 దేవుడు సృష్టించిన ప్రతి వస్తువు మంచిది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొనినయెడల ఏదియు నిషేధింపతగినది కాదు;
5 ఏలయనగా అది దేవుని వాక్యమువలనను ప్రార్థనవలనను పవిత్రపరచబడుచున్నది.
6 ఈ సంగతులను సహోదరులకు వివరించినయెడల నీవు అనుసరించుచు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యములచేత పెంపారుచు క్రీస్తుయేసుకు మంచి పరిచారకుడవై యుందువు.
7 అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి, దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసికొనుము.
8 శరీరసంబంధమైన సాధకము కొంచెముమట్టుకే ప్రయోజనకరమగును గాని దైవభక్తి యిప్పటి జీవము విషయములోను రాబోవు విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును.
9 ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై యున్నది.
10 మనుష్యులందరికి రక్షకుడును, మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవముగల దేవునియందు మనము నిరీక్షణ నుంచియున్నాము గనుక ఇందునిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము. ఈ సంగతుల నాజ్ఞాపించి బోధించుము.
11-12. నీ యౌవనమునుబట్టి నిన్నెవనిని తృణీకరింపనియ్యకుము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను, విశ్వాసులకు మాదిరిగా ఉండుము.
13 నేను వచ్చు పర్యంతము చదువుటయందును, హెచ్చరించుటయందును, బోధించుటయందును జాగ్రత్తగా ఉండుము.
14 పెద్దలు హస్తనిక్షేపణము చేయగా ప్రవచనమూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకుము.
15 నీ అభివృద్ధి అందరికి తేటగా కనబడునిమిత్తము వీటిని మనస్కరించుము, వీటియందే సాధకము చేసికొనుము.
16 నిన్ను గూర్చియు నీ బోధనుగూర్చియు జాగ్రత్త కలిగియుండుము, వీటిలో నిలుకడగా ఉండుము; నీవీలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొందువు.

No comments:
Post a Comment