Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Thursday, July 25, 2013

1వతిమోతికి3వఅధ్యాయము

1  ఎవడైనను అధ్యక్షత నాశించినయెడల అట్టివాడు దొడ్డపనిని అపేక్షించుచున్నాడను మాట నమ్మదగినది. 
2  అధ్యక్షుడగువాడు నిందారహితుడును, ఏకపత్నీ పురుషుడును, మితానుభవుడును, స్వస్థబుద్ధిగలవాడును, మర్యాదస్థుడును, అతిధిప్రియుడును, బోధింపతగిన వాడునైయుండి, మద్యపానియు కొట్టువాడునుకాక, సాత్వికుడును, జగడమాడనివాడును, ధనాపేక్షలేనివాడునై, 
3  అధ్యక్షుడగువాడు నిందారహితుడును, ఏకపత్నీ పురుషుడును, మితానుభవుడును, స్వస్థబుద్ధిగలవాడును, మర్యాదస్థుడును, అతిధిప్రియుడును, బోధింపతగిన వాడునైయుండి, మద్యపానియు కొట్టువాడునుకాక, సాత్వికుడును, జగడమాడనివాడును, ధనాపేక్షలేనివాడునై, 
4  సంపూర్ణమాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు, తన యింటివారిని బాగుగ ఏలువాడునైయుండవలెను. 
5  ఎవడైనను తన యింటివారిని ఏలనేరకపోయినయెడల అతడు దేవుని సంఘమును ఏలాగు పాలించును? 
6  అతడు గర్వాంధుడై అపవాదికి(కలిగిన) శిక్షావిధికి లోబడకుండునట్లు క్రొత్తగా చేరినవాడై యుండకూడదు. 
7  మరియు అతడు నిందపాలై అపవాదిఉరిలో పడిపోకుండునట్లు(సంఘమునకు) వెలుపటివారిచేత మంచి సాక్ష్యము పొందినవాడై యుండవలెను. 
8  ఆలాగుననే పరిచారకులు మాన్యులైయుండి, ద్విమనస్కులునుమిగుల మద్యపానాసక్తులును, దుర్లాభము నపేక్షించువారునైయుండక 
9  విశ్వాసమర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొనువారై యుండవలెను. 
10  మరియు వారు మొదట పరీక్షింపబడవలెను; తరువాత వారు అనింద్యులైతే పరిచారకులుగా ఉండవచ్చును. 
11  అటువలె (పరిచర్యచేయు) స్త్రీలును మాన్యులై, కొండెములుచెప్పునివారును, 3మితానుభవముగలవారును, అన్ని విషయములలో నమ్మకమైనవారునై యుండవలెను 
12  పరిచారకులు ఏకపత్నీ పురుషులును, తమ పిల్లలను తమ యింటివారిని బాగుగా ఏలువారునై యుండవలెను. 
13  పరిచారకులైయుండి ఆ పని బాగుగా నెరవేర్చినవారు మంచిపదవిని సంపాదించుకొని క్రీస్తుయేసునందలి విశ్వాసమందు బహు ధైర్యము గలవారగుదురు. 
14  శీఘ్రముగా నీయొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను; 
15  అయినను నేను ఆలస్యముచేసిన పక్షమందు దేవుని మందిరములో, అనగా జీవముగల దేవుని సంఘములో, జనులేలాగుప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని యీ సంగతులను నీకు వ్రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై యున్నది. 
16  నిరాక్షేపముగా దైవభక్తినిగూర్చిన మర్మముగొప్పదై యున్నది;ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యెనుఆత్మవిషయమున నీతిపరుడని తీర్పునొందెనుదేవదూతలకు కనబడెను (రక్షకుడని) జనమునయందు ప్రకటింపబడెనులోకమందు నమ్మబడెనుఆరోహణుడై తేజోమయుడయ్యెను. 
   Download Audio File

No comments:

Post a Comment